గ్లామర్ నటిగా కెరీర్ లో నిలదొక్కుకుని ఆపై టాప్ హీరోలతో వరుసగా జోడి కట్టిన శ్రియా కొన్నాళ్లుగా సైలెంట్ అయిపోయింది. ఆమె తీసుకున్న కొన్ని తొందరపాటు నిర్ణయాలు ఆమె కెరియర్ వేగాన్ని తగ్గించాయి. అడపా దడపా హాట్ ఫోటో షూట్ లతో తప్ప ఆమె ఒరగబెట్టింది ఏంలేదు. డీగ్లామర్ రోల్స్ తో చేసిన మనం, గోపాల గోపాలలు ఆమెకు అవకాశాలు తెచ్చిపెట్టలేదు. దీంతో ఎక్స్ పోజింగ్ కు కంప్లీట్ గా దూరం అవ్వాలని ఆమె నిర్ణయించుకుందట. ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో ముఖ్యమైన పాత్రను చేయడానికి ఒప్పుకుందట. అంతేకాదు ఇకపై ఈ తరహా పాత్రల్లో కొనసాగే అవకాశం వుందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఆ సినిమా నిర్మాణ దశలో వుందని సమాచారం. త్వరలోనే సిినిమా వివరాలను, ఆమె పాత్ర వివరాలను చిత్ర యూనిట్ అనౌన్స్ చేస్తుందట. ఈ నేపథ్యంలో ఇక శ్రియ కథానాయిక పాత్రలపై ఆశలు వదులుకుని, ప్రాధాన్యత కలిగిన పాత్రలను చేసుకుంటూ వెళుతుందని చెప్పుకుంటున్నారు. నదియా, రమ్యకృష్ణ వంటి సీనియర్ కథానాయికల దారిలోనే ఆమె కూడా నడవనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు త్వరలో ఆమె వివాహం చేసుకోవాలనుకుంటుందట. దీంతో కంప్లీట్ గ్లామర్ షోను పక్కన పెట్టేయాలని శ్రియా భావిస్తుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అంటే యూత్ ఇక శ్రియా హాట్ షో సినిమాల్లో మిస్సవుతారన్న మాట. ఇంకో అవకాశం దొరికింది మరి దీనైనా శ్రియా సరిగ్గా వాడుకుంటుందో లేదో? చూద్దాం.