సంవత్సరాలుగా ఓ ప్రైవేట్ సంస్థకు అంకితమై పనిచేసినా ఇలాంటి ఆఫర్స్ ఎవరివ్వగలరు. అవును అనుష్క ఆ పని చేస్తోంది. తను ఫీల్డ్ లోకి వచ్చి నిండా పది సంవత్సరాలు కూడా కావడం లేదు. కానీ తన వద్ద పని చేసే వాళ్ళకు ప్లాట్లు కొనిస్తోందట అనుష్క. ఇంత పెద్ద మనసు చేసుకుందంటే జీవిత కాలం ఆమె వద్దే పని చేయాలనే కృతఙ్ఞతా భావం నిండిపోతుంది వారిలో. ఈ మధ్య తారలందరూ వారు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పేదవాళ్ళకు ఖర్చుచేయాలని భావిస్తున్నారు. హన్సిక అనాధ బాలల్ని దత్తత తీసుకొని వారి కోసం బాంబే శివార్లలో స్థలం కొనేసింది. ప్రత్యూష ఫౌండేషన్ కోసం సమంత ఖర్చు చేస్తోంది. ఇప్పుడు అనుష్క ఇలా స్టాఫ్ కు హైదరాబాద్ లో స్థలాలు కొనివ్వాలని డిసైడ్ అయ్యింది. తనకీ ఆలోచన తమిళ హీరో అజిత్ ద్వారా వచ్చిందట. ఈ హీరో తన దగ్గర పని చేసే స్టాఫ్ కోసం చెన్నై శివార్లలో స్థలం కొని స్వయంగా ఇళ్లు కట్టి ఇస్తున్నాడట. అజిత్ తో ‘ఎన్నై అరిందాల్’ సినిమా చేస్తున్న అనుష్క ఆ షూటింగ్ సందర్భంలో ఈ విషయం తెలుసుకుందట. తాను కూడా ఈ పని ఎందుకు చేయకూడదనే ఆలోచనతో వెంటనే స్టాఫ్ ను పిలిచి ఈ ఆఫర్ ఇచ్చిందట. కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా తను ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చే తన స్టాఫ్ కు ఈ మాత్రం చేయకపోతే ఎలా అనుకుందట అనుష్క. సినిమాలోనే కాదు నిజంగా జేజమ్మే అనుష్క.