అనుష్క హర్టయ్యింది

December 27, 2014 | 01:24 PM | 25 Views
ప్రింట్ కామెంట్

అమ్మాయిల కెరీర్ గురించిగానీ, మరే పర్సనల్ విషయాల్లో గానీ కామెంట్ చేస్తే కొందరికి కోపం రావచ్చు మరికొందరు లైట్ గా తీసుకోవచ్చు. కానీ అందం విషయంలో కామెంట్ చేస్తే మాత్రం ఆడవాళ్ళందరికీ బాధే. ఇది నూటికి నూరు పాళ్ళు నిజం. ఇక అందంతోనే సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టే హీరోయిన్లను అందం గురించి కామెంట్ చేస్తే ఊరుకుంటారా? బాధపడరూ... అనుష్క విషయంలోనూ అదే జరిగింది. ’నా పని నేను చేసుకుపోతా.. జయాపజయాలు గురించి పట్టించుకోను.. నా పాత్ర ప్రాధాన్యత తగ్గిందన్నా నేను పట్టించుకోను’ అన్న ఈ భామ లింగా విమర్శలకు బాగానే అప్‌సెట్ అయ్యారన్నది నిజం. పాత్ర విషయంలో పెద్దగా పట్టించుకోలేదు. రజనీ సరసన అవకాశం రావడమే అదృష్టంగా భావించానని ముందుగానే స్పష్టం చేసింది కానీ ఈ సినిమాలో ఆమె బొద్దుగా ఉందన్న కామెంట్ కు చాలా హర్ట్ అయ్యింది. రుద్రమదేవి, బాహుబలి చిత్రాలతో తీరిక ఉండకపోవడంతో తన శరీరంపై అంత శ్రద్ధపెట్టలేదట. దీంతో అసలే యోగా టీచరమ్మ నీ బాడీ బరువు పెరిగిందంటే ఊరుకుంటుందా? సన్నబడే కసరత్తులు మొదలు పెట్టింది మరి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ