ఈ విషయం అందరికీ తెలిసిందే. బాహుబలి పార్ట్ 1 కోసం కూడా అనుష్క కాస్త ఒళ్ళు పెంచాల్సి వచ్చింది. ఇదే కాకుండా సైజ్ జీరో కోసం ఏకంగా 25 కేజీల బరువు పెరిగింది అనుష్క. ఇప్పుడు మళ్ళీ బాహుబలి 2 కోసం నాజూకైన అమ్మాయిగా కనిపించాలని సన్నబడడానికి సిద్ధపడింది. ఒకేసారి ఇంత బాడీని తగ్గించుకోవాలంటే చాలా కష్టం కదా... అందుకే అనుష్క తన బరువు తగ్గించుకోవడం కోసం వెయిట్ లాస్ థెరపీ చేయించుకోడానికి యూఎస్ పయనమవుతోంది. తాను మునుపటిలా నాజుకైన అందమైన ఆకృతిని పొందడానికి వెయిట్ లాస్ సర్జరీ చేయించుకోబోతున్నట్టు చెపుతోంది.
ఇక అనుష్క మునుపటి సన్నజాజి తీగ రూపాన్ని సంతరించుకుని అభిమానుల కళ్ళకి ఫీస్ట్ చేయబోతోందన్న మాట.
ఆమె బాహుబలిలో కనిపించింది కొద్ది సేపే అయినా అనుష్క అందాన్ని ఆరాదించే వారు అలా అనుష్కను చిరిగిన చీరలో చూడలేక చాలా ఇబ్బంది పడ్డారు. ఇక బాహుబలి 2 లో అనుష్క యువరాణి గెటప్ లో తన అందచందాలు తెరమీద పరచబోతుంది.