బాగా క్లిక్ అయిన సినీ స్టార్ల జీవితం గురించి చాలా గొప్పగా అనుకుంటుంటారు సామాన్యులు... అది నిజమే కావచ్చు... డబ్బు... హోదా... అభిమానులు... ఎక్కడికి వెళ్ళినా వారికిచ్చే మర్యాద అదంతా ఓ కలల ప్రపంచమే... కానీ ఎప్పుడైనా మామూలు జనాల మధ్యకు వెళితే తెలుస్తుంది వారి ఇబ్బంది... ఈ మధ్యే అల్లు అర్జున్ కొడుకుతో రయ్ రయ్ మని సిటీ అంతా తిరగాలని ఉందట అంటూ... ఓ ఆర్టికల్ కూడా రాశాం... కానీ సెలబ్రిటీలకు అలా కుదరదు కదా... ఈ విషయంలో అర్జున్ చాలా ఫీలవుతున్నాడట అని కూడా రాశాం.
ఈ దసరాకు సతీమణి స్నేహ రెడ్డి కోరిక మేరకు ఆమె అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళాడు అల్లుఅర్జున్. కానీ ఊరి జనాలు వారిని ప్రశాంతంగా ఉండనివ్వరు కదా... ఇంటిమీదకు గుమికూడారు... సరే నాలుగు ముచ్చట్లు మాట్లాడి వెళ్లొచ్చుకదా... మీద మీదకు దూసుకు వచ్చేస్తుంటారు. ఇది వారిని ఎంత ఇబ్బందికి గురి చేస్తుంది... దీంతో అల్లు అర్జున్ చాలా చిరాకు పడ్డాడు. ఒక వ్యక్తి అల్లు అర్జున్ ముందుకు దూసుకు వస్తుంటే... మరో కుర్రాడు అడ్డుకున్నందుకు అతన్ని నెట్టేశాడట. అది చూసి అర్జున్ కు కోపం వచ్చేసింది. దీంతో ‘ఆ కుర్రాడిమీద చెయ్యెందుకు లేపావు’ అని కోపం తెచ్చుకుని అక్కడినుంచి వెళ్ళిపోయాడట. అల్లు అర్జున్ దసరా పండుగ సందర్భంగా నల్లగొండ జిల్లాలోని చింతపల్లి అనే గ్రామానికి వెళ్ళిన వార్త మీడియా అంతటా హల్ చల్ చేసిన స0గతి తెలిసిందే. అసలే హీరోలు అందరిలా సినిమాళ్ళకు, షాపింగ్ లకూ... పార్కులకు వెళితే బాగుండని ఆశ పడుతుంటారు. ఇలాంటి లైఫ్ ను కోల్పోతున్న వారికి అభిమానులు ఆనందాన్ని ఇవ్వగలగాలే గానీ ఇబ్బంది పెట్టకూడదు కదా...