టాలీవుడ్ అగ్ర నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత చలసాని అశ్వనీదత్ కుమార్తె ప్రియాంకదత్ వివాహం ఓ యంగ్ డైరెక్టర్ తో నిశ్చయమైందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియాంక తన సొంతంగా ఏంజిల్స్ స్టూడియో అనే బేనర్ స్థాపించి బాణం, ఓం శాంతి ఓం. సారొచ్చారు వంటి విభిన్న చిత్రాలు నిర్మించి మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు పొందింది. ప్రియాంక తన సోదరి స్వప్నతో కలిసి స్వప్న సినిమాస్ పతాకంపై నాని హీరోగా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా నిర్మించారు. ఇది బాక్సాఫీస్ సక్సెస్ సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ అనే కొత్త డైరెక్టర్ ను పరిచయం చేశారు. ఈయన ఫారిన్ లో డైరెక్షన్ కోర్సు చేశాడు. మొదటి సినిమాను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసి ఒకే అనిపించుకున్నాడు ఈ డైరెక్టర్. నాని కూడా ఈ సినిమాతో కాస్త ఊపిరి తీసుకున్నాడు. అంతకు ముందు సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయి. ఈ సినిమాతో నిర్మాత ప్రియాంకకు కూడా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా అంతా హిమాలయాల్లో తీయడం... ఆ సమయంలో నిర్మాతకు, డైరెక్టర్ కు మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త పెళ్ళికి దారి తీసిందనుకుంటున్నారు. వీరి పెళ్ళి గురించి ఇరు కుటుంబాలు మాట్లాడుకొని అఫీషియల్ గా త్వరలో అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తోంది.