బాహుబలి సినిమా కోసం రెండున్నర సంవత్సరాలు నిరీక్షించి ఇక ఆగలేమన్నట్టు మొదటి రోజే టిక్కెట్లను ఏదో విధంగా సంపాదించేసి... చూసేశారు వీరాభిమానులంతా. కానీ మళ్ళీ చూడమంటున్నారు ఈ చిత్ర యూనిట్. కారణం లక్ష్మి మంచు లాంటి చాలా మంది అసంతృప్తిగా ఉన్నారుగా మరి... ఎందుకంటే సినిమా సస్పెన్స్ భరించడం చాలా మంది కి చాలా కష్టంగా ఉంది. డైలీ సీరియల్ అయితే... ముగింపు... ఎప్పుడవుతుందా అని రోజూ ఓపిగ్గా చూసేస్తున్నారు. మరి రాజమౌళిగారేమో... సెకండ్ పార్ట్ కోసం నెక్స్ట్ ఇయర్ కోసం ఆగమంటే ఎలా? ఇదే అన్న మాట అసంతృప్తి... ఈ అసంతృప్తి నుంచి రిలీఫ్ కలగడానికి రెండో రోజు నుంచి కొన్ని థియేటర్లలో సెకండ్ పార్ట్ టీజర్ చూపిస్తున్నారట. అది కూడా ఐదు నిమిషాల టీజర్. మూడో రోజునుంచి అన్ని థియేటర్లలో ఈ టీజర్ చేరుకునేలా చేశారట. ఇక బోలెడు సస్పెన్స్ తో థియేటర్లోంచి బయటపడేవారికి ఇది కాస్త ఊరట కలిగించవచ్చు. ఇప్పటికే రెండు పార్ట్ ల షూటింగ్ చాలా వరకు చేశారు కాబట్టి... సెకండ్ పార్ట్ విజువల్స్ చూపించగలుగుతున్నారు. సో... మొదటి రోజు ఈ టీజర్ మిస్సయిన వారంతా ఈ సినిమా చూడ్డానికి మళ్ళీ థియేటర్లకు వెళ్ళాలన్నమాట... ఊరట ఏమో గానీ చూసిన వాళ్ళు మళ్ళీ చూసేందుకు ఇదో తెలివయిన ట్రిక్ ప్లేచేసినట్టున్నారు ఈ చిత్ర యూనిట్....?