ఎస్.ఎస్.రాజమౌళి ఇండియాలో ఓ పెద్ద దర్శకుడిగా మరో సారి నిరూపించుకున్నాడు. తాను దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ మరోసారి బాక్సాఫీసు రికార్డును బద్దలు కొట్టింది. అంతకు ముందు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.385 కోట్లు రాబట్టగా, ఇప్పుడు అది 500 కోట్లకు చేరుకుంది. ఈ రికార్డును బాలీవుడ్ చిత్రాలైన ధూమ్ 3, పీకే సినిమాలు మాత్రమే సాధించాయి. అంతకు ముందు ఈ రెండు చిత్రాలు 500 కోట్ల కలెక్షన్ రాబట్టి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బాహుబలి చిత్రం కూడా ఆ స్థాయికి వచ్చేసింది. అమీర్ ఖాన్ ధూమ్ 3, వరల్డ్ వైడ్ గా 18 రోజుల్లో 500 కోట్లు రాబట్టింది. దాన్ని పీకే 13 రోజుల్లోనే రాబట్టు కోగలిగింది. ఇప్పుడు ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి సౌత్ చిత్రాల్లో 500 కోట్లు రాబట్టిన మొదటి చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకూ మరే చిత్రమూ ఈ రికార్డుకు దగ్గరగా కూడా రాలేకపోయింది. ఓ తెలుగు సినిమా బాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఇంత కలెక్షన్ రాబట్టడంపై తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగిన అంశం ఈ క్రెడిట్ రాజమౌళికి టీంకు దక్కింది. ఇంతవరకూ ఏ ఇతర భాషా చిత్రాల్లో నటించని ప్రభాస్ ఈ సినిమాతో ఇండియాతో పాటు ప్రపంచ స్థాయి గుర్తింపును దక్కించుకున్నాడు.