ట్రైలర్ కోసం థియేటర్లకు క్యూ కట్టిస్తున్నాడు

June 01, 2015 | 11:29 AM | 2 Views
ప్రింట్ కామెంట్
Rajamouli_Baahubali_Trailer_Launch_in_theaters_niharonline

దర్శకధీరుడు, జక్కన గత మూడు ఏళ్లుగా చెక్కుతున్న చిత్రం బాహుబలి. సుమారు 150 కోట్లకు పై బడ్జెట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్ ఈరోజు (జూన్ 1న) విడుదల అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన 21 సెకన్ల టీజర్ కు విపరీతమైన స్పందన రావటంతో ఇక ట్రైలర్ కి అది రేంజ్ లో ఉంటుందో ఊహించటం కష్టం. ఎటువంటి డైలాగులు లేని టీజర్ కి తమిళ బాషలో కూడా భారీగా రెస్పాన్స్ రావటం ఓ విశేషం. పోటాపోటీగా విడుదలైన మహేష్ శ్రీమంతుడు టీజర్ కి దాదాపు 7 లక్షల మంది వీక్షించగా, బాహుబలిని దాదాపు 10లక్షల పై జనాలు వీక్షించారు. ఇక ట్రైలర్ ను 1న సాయంత్రం ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు రాజమౌళి అండ్ కో. అయితే కొంచెం ముందుగానే సరికొత్త సౌండ్ టెక్నాలజీతో ఈ చిత్ర ట్రైలర్ ను థియేటర్లలో విడుదల చేయనున్నాడట. దీంతో ట్రైలర్ ని ఎలాగైనా చూడాలనే తాపత్రయంతో జనాలు థియేటర్లకు క్యూ కడుతున్నారు. థియేటర్ల యజమానులు కూడా బయట బాహుబలి ట్రైలర్ ప్రదర్శించబడును అనే బోర్డులు పెట్టేశారట.  ట్రైలర్ కే జక్కన్న ఇలా జనాలను థియేటర్లకు క్యూ కట్టిస్తే, ఇంకా సినిమానే వస్తే పిచ్చెక్కిస్తాడన్నటంలో సందేహాం లేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ