భారతీయ సినిమా చరిత్రలో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది బాహుబలి. ఈ సినిమా బిజినెస్, కలెక్షన్ల పరంగా ఎన్నో రికార్డులు సృష్టించింది. బాహుబలి సంచలనాలు ఇంకా పూర్తి కాకుండానే ఈ సినిమా బుల్లి తెరమీద రాబోతోందేంటబ్బా అనుకున్నారంతా... ఇందులో మతలబు ఉందండీ... ఇక్కడ కూడా రికార్డులు సృష్టించడానికే ఈ సినిమా ఇంత త్వరగా బుల్లి తెరమీద ఆడబోతోంది. ఈ సినిమాను మా టీవీ రెండు భాగాలు కలిపి 35 కోట్లకు ప్రచార హక్కుల్ని తీసుకుంది. ఇన్ని కోట్లు వెచ్చించినప్పుడు మరి అవి వెనక్కు తీసుకునే ప్లానింగ్ చేయాలి కదా. అక్టోబర్ 25న బాహుబలి తెలుగు వెర్షన్ మాటీవీలో ప్రసారం కానుంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ ఈ సినిమాకు వస్తుందని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా మధ్యలో ప్రసారం అయ్యే యాడ్స్ రేటు కూడా భారీగానే వసూలు చేయాలి కదా. పది సెకన్ల ప్రకటన ధర రూ.2.5 లక్షలు పలుకుతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ఏ సినిమాకు యాడ్స్ ఇంత ఖరీదుగా లేవు. దీన్ని బట్టి బాహుబలి సినిమాపై క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.