బాహుబలిని వీక్షించిన గవర్నర్ దంపతులు

July 25, 2015 | 03:52 PM | 5 Views
ప్రింట్ కామెంట్
bahubali_special_show_for_governr_niharonline

పెద్ద సంచలనంగా మారిన ‘బాహుబలి’ చిత్రం ఇప్పుడు ఎప్పుడూ సినిమాల వంక చూడని వారి దృష్టి కూడా పడిపోతోంది. ఇప్పటికే ఈ సినిమా కోటాను కోట్ల కలెక్షన్లను రాబడుతోంది. అయితే ఈ చిత్రాన్ని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు తిలకించారు. శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్ లోని ప్రసాద్ ఫిలిం ల్యాబ్ లో ప్రత్యేకంగా ప్రదర్శించిన ఈ సినిమాను గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ తో పాటు కుటుంబ సభ్యులతో కలిసి చూశారు.  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' సినిమా విజయవంతంగా 3వ వారంలోకి ప్రవేశించింది. తెలుగులో ఈ చిత్రం షేర్ రూ. 100 కోట్లకు చేరువ కాగా, హిందీలో రూ. 70 కోట్ల మార్కును అధిగమించింది. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ