‘బాహుబలి’ ది బిగినింగ్ అంతా సస్పెన్స్ తో ముగించడంతో... కొందరు మిగతా పార్ట్ చూడ్డానికి సంవత్సరం ఆగాలా అని తిట్టుకుంటున్నట్టు ఈ సినిమా కథకుడు విజయేంధ్రప్రసాద్ స్వయంగా చెప్పుకున్నాడు. మరి ఈ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు ముగుస్తుంది అన్న విషయంపై ఆడియన్స్ లో యాంగ్జైటీ ఉంటుంది కదా... దీన్ని ప్రభాస్ క్లియర్ చేశారు. పార్ట్-2 షూటింగ్ సెప్టెంబర్ 15 నుంచి మొదలవుతుందని ఆయన తెలిపారు. పార్ట్ 2కు సంబంధించి షూటింగ్ 40 శాతం ఇప్పటికే పూర్తి చేశారనీ, ప్రధాన పాత్రల మధ్య సన్నివేశాలు చిత్రీకరణ పూర్తయిందనీ, మిగిలినది... యుద్ధం, ఇతర కీలక సన్నివేశాలు మాత్రమే షూట్ చేయాల్సి ఉందన్నారు. సెకండ్ పార్ట్ కు ‘బాహుబలి-ది కంక్లూజన్' పేరుతో రాబోతోందన్నారు. 2016లో ఈ సినిమా విడుదల కానుంది. గత రెండేళ్లుగా బాహుబలి షూటింగుకే పరిమితమైన ప్రభాస్ ప్రస్తుతం యూరఫ్ వెళ్లి తన స్నేహితులతో కలిసి రిలాక్స్ అవుతున్న సంగతి తెలిసిందే.