సినిమా కథకు కాస్త సైంటిఫిక్ ఎలిమెంట్స్ జోడింస్తే, అదొక వెరైటీ కథ అయిపోయింది. టెక్నాలజీ పరంగా కొంత క్రియేటివిటీ ఇస్తుండడంతో జనాలకు కొత్తదనం అందిస్తుండడం వల్ల ఈ సినిమాలకు మంచి స్పందనే కనిపిస్తోంది. ఇటీవల వచ్చిన రోబో, ఐ, పీకే సినిమాలు అలాంటివే. ఇలా క్రియేటివ్ గా ఆలోచించే డైరెక్టర్ మన తెలుగు వాళ్ళలో సింగితం శ్రీనివాస్ రావు కూడా ఉన్నారు. 'ఆదిత్య 369' అనే సినిమాతో ఆయన 25 ఏళ్ళ క్రితమే మన తెలుగు సినిమాకు ఓ ప్రయోగం చేసి చూపించారు. ఇందులో టైమ్ మెషిన్ అని ఓ మెషిన్ తో భూత భవిష్యత్ కాలాలు ఎలా ఉన్నాయి, ఉండబోతున్నాయి అని చూపించారు. వినోదం, విజ్ఞానం కలిపి చూపించారీ సినిమాలో. ఇందులో బాలకృష్ణను కృష్ణదేవరాయలుగా చూపించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ 'టైం మెషిన్' కాన్సెప్ట్ ను ఇటీవల ఒక హాలీవుడ్ సినిమా వాడిందంటే దర్శకుడి క్రియేటివిటీ ఎలాంటిదో అర్థ మవుతుంది. ఈ సినిమా ఆ దర్శకుడి కెరీర్ కి ఓ ప్రత్యేకచిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారని ఆ మధ్య మళ్ళీ వార్తలు వినిపించాయి కానీ ఎందువల్లో ఆ సినిమా ఆలోచన అటకెక్కింది. ఇప్పుడు మళ్ళీ మాలకృష్ణ 101 సినిమాగా ఇలాంటి ఓ చిత్రం తీయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది ఆ సినిమాకు ‘ఆదిత్య 999’ అనే టైటిల్ పెట్టాలని కూడా అనుకుంటున్నారట. దీనికి సంబంధించిన కథ కూడా సింగీతం శ్రీనివాసరావు బాల కృష్ణకి వినిపించారట. ఆయన కూడా ఈ సినిమాకు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు 99వ సినిమా డిక్టేటర్ ఆ తరువాత 100వ సినిమా కూడా ఖరారు కావడంతో, ఇక బాలయ్య 101వ సినిమాగా ఆదిత్య 999 అవుతుందని అనుకుంటున్నారు.