బాలకృష్ణ సినిమాల్లో ఎక్కువ శాతం భారీ డైలాగులతో విలన్ల పని పట్టే సింహం లాంటి హీరోగా గర్జిస్తుంటాడు. కానీ రియల్ లైఫ్ లో మాత్రం చాలా జోవియల్ గా ఉంటాడన్న విషయం పలు సినిమా ఫంక్షన్లలో ఆడియన్స్ చూసే ఉంటారు. అలా శనివారం సాయంత్రం జరిగిన సంతోషం అవార్డు ఫంక్షన్ లోనూ అందరి.నీ ఉషారెత్తించాడు ఈ హీరో... ఆయన డైలాగ్ లు చెపుతూ, పాటలు పాడుతూ, స్టెప్పులు వేస్తూ అందరినీ ఆనంద పరచడం ఆయనకో సరదా... మరి ఈ ఫంక్షన్ ఆయన తండ్రితో పలు సినిమాల్లో ఐటమ్ డాన్స్ లు చేసిన జ్యోతిలక్ష్మి చిందులేశాడట. ఈ కనువిందును నవ్వులు, ఈలల మధ్య ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేశారు. జ్యోతి లక్ష్మితో డాన్స్ లో కాదు, పాటలు కూడా పాడారు. దీంతో ఈ వేడుక మరింత సందడిగా మారిపోయింది. హైదరాబాద్లో జరిగిన 'సంతోషం' సినిమా పురస్కారాల 2014కిగానూ సంతోషం లెజెండరీ యాక్టర్ పురస్కారాన్ని దర్శకుడు కోడి రామకృష్ణ చేతులమీదుగా బాలకృష్ణ అందుకొన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ ''సినిమా విజయం వెనుక సమష్టి కృషి ఉంటుంది.'సింహా' కంటే 'లెజెండ్'బాగా ఆడింది. అందుకు కారణమైన దర్శకనిర్మాతలు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. నటుడంటే అనుకరించేవాడు కాదు, పాత్రలో జీవించేవాడు అని నాన్నగారు చెబుతుండేవారు. అందుకే నేను పాత్రల్లో జీవించే ప్రయత్నం చేస్తుంటా'' అన్నారు.
బాలకృష్ణ చిరంజీవి 60వ పుట్టిన రోజున కూడా ఆయన రెండు పాటలకు స్టెప్పులు వేసి అందరినీ ఆనంద పరిచాడు. ముఠామేస్త్రీ పాటకు, శంకర్ దాదా ఎంబిబిస్ పాటకు ఆయన స్టెప్పులు వేయడమే కాదు చిరంజీవిని అనుకరించాడట. ఎలాంటి భేషజాలు లేకుండా ఇండస్ట్రీలోని ఓ ప్రముఖ హీరో పాటలకు మరో ప్రముఖ హీరో స్టెప్పులు వేసి అందరినీ ఆనందడోలికల్లో ముంచెత్తాడట బాలకృష్ణ.