బండ్లకు బెయిల్

June 25, 2015 | 06:50 PM | 5 Views
ప్రింట్ కామెంట్
producer_bandla_ganesh_niharonline

సినీ నిర్మాత బండ్ల గణేష్ కు కోర్టు ఊరట కల్పించింది. చెక్ బౌన్స్ కేసును ఎదుర్కొంటున్న ఆయన ఇప్పుడు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఆయన పెట్టుకున్న బెయిల్ పిటీషన్ పై సానుకూలంగా స్పందిస్తూ, బెయిల్ మంజూరు చేసింది. ‘నీ జతగా నేనుండాలి’ సినిమాకు సంబంధించిన వివదంపై సినీ హీరో సచిన్ జోషి బండ్ల గణేష్ పై కేసు ఫైల్ చేశారు. ఈ కేసుకు సంబంధించి గురువారం కోర్టుకు హాజరైన బండ్ల గణేష్ కు బెయిల్ రావడంతో పాటు, ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నాడు. దీంతో బండ్ల గణేష్ కాస్త ఊపిరి తీసుకున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ