తలపై 90 కేజీల బరువుతో డాన్స్?

August 08, 2015 | 12:23 PM | 5 Views
ప్రింట్ కామెంట్
singh_is_bling_bangra_dance_niharonline

మామూలు జనాలకు సరదాగా రెండు మూడు స్టెప్పులేస్తే ఆయాసం వచ్చేస్తుంది. మరి తలపై 90 కేజీల బరువుతో డాన్స్ చేయడమంటే మాటలా? ఇది ప్రత్యేక వార్తే కదా... దీంతో తమ సినిమాను ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారు.  ప్రభుదేవా దర్శకత్వంలో వస్తున్న సింగ్ ఈజ్ బ్లింగ్ చిత్సిరం బృందం. సినిమాలో ఇదొక ప్రత్యేక మైన డాన్స్. తలపై 90 కేజీల బరువు వైన తల పాగాతో డాన్స్ చేస్తారట. మామూలుగా హీరో హీరోయిన్లు బరువైన దుస్తూలు వేసుకోవాలంటేనే  చాలా ఆయాసపడిపోతారు. మరీ ఇంత బరువైనా తల పాగా ధరించడమే కాదు. డాన్స్ వేయడమంటే మాటలు కాదు. ‘టంగ్ టంగ్ భజే అనే పాట తో ఓ భాంగ్రా డాన్స్ పెట్టారట... ఈ సినిమాలో. పంజాబ్ గ్రామీణ ప్రాంతాలలో అక్కడి ప్రముఖ భాంగ్రా గిడ్డా కళాకారులతో ఈ పాటను చిత్రీకరించారు. ఈ సినిమాలో ఇదో ప్రత్యేక అంశంగా భావించిన చిత్ర బృందం దీనిని ప్రచార కార్యక్రమాల్లో ఉపయోగించుకోవాలని ట్రైలర్ కంటే ముందే విడుదల చేస్తున్నారు. ఈ నెల 14 విడుదల కానున్న బ్రదర్స్ సినిమా విరామ సమయంలో ఈ పాటని ప్రదర్శించబోతున్నారట.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ