టైగర్ ను దెబ్బతీసిన బస్తీ

July 03, 2015 | 04:17 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Tiger_movie_release_date_poster_niharonline

ఈ రోజు ఓ మోస్తరు లేదా చిన్న సినిమాలు కలిపి దాదాపు 11 విడుదలయ్యాయి. ఇప్పుడు ఆడుతున్న సినిమాల్లో టైగర్ బెస్ట్ అని టాక్ తెచ్చుకుంది. దీనితో పాటు విడుదలైన సినిమాలన్నీ దాదాపు థియేటర్ల నుంచి సర్దుకున్నాయి. అయితే ఈ రోజు (3 జులై) విడుదలైన 11 సినిమాల వల్ల టైగర్ కూ దెబ్బ పడింది. కొన్ని చోట్ల టైగర్ సినిమా కూడా తీసివేశారు. ఈ రోజు విడుదలైన సినిమాల్లో జయసుధ తనయుడు శ్రేయాన్ నటించిన బస్తీ సినిమాకు ప్రచారం బాగానే జరిగింది. ఈ సినిమా  టైగర్ ను చాలా చోట్ల లేపేసిందనే చెప్పాలి. థియేటర్ల విషయంలో జయసుధ లాబీయింగ్ బగానే చేసినట్టు కనిపిస్తోంది. ఈ వారం వచ్చిన సినిమాలన్నిటికీ కలిపి ఎన్ని థియేటర్లో, దాదాపు బస్తీ ఒక్క సినిమాకే అన్ని థియేటర్లు ఇచ్చారు. బస్తీ సినిమా దాదాపు 30 థియేటర్లలో విడుదలైంది. టైగర్ ను కేవలం పది సినిమా థియేటర్లకు పరిమితం చేశారు. మరో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే దిల్ రాజు సినిమా కేరింత మాత్రం ఇప్పటికీ హైదరాబాద్ లో 20కి పైగా థియేటర్లలో ఆడుతోంది. కలెక్షన్లు తగ్గినా దీన్ని తీయకుండా ఆడించేస్తున్నారు. మరి బాగా ఆడుతున్న టైగర్ సినిమాను ఎందుకు లేపేసినట్టు...ఇక్కడ కూడా బలవంతుల హవా నడుస్తున్నట్టేనా?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ