హీరోయిన్ పై మోజు పెంచుకున్న ఆ దర్శకుడు ఘోరానికి పాల్పడ్డాడు. చిత్ర షూటింగ్ కోసం హజరైన వీరిద్దరు ఓ కాలేజీ ప్రాంగణంలో పడుకోగా, అజయ్ అనే దర్శకుడు వారిపై యాసిడ్ దాడి చేశాడు. భోజ్ పురి సినీ పరిశ్రమలో ఈ దారుణం చోటుచేసుకుంది. తన ఇష్టానికి వ్యతిరేకంగా వికాస్ అనే హీరోతో కలిసి పనిచేస్తున్నందుకే రూపాలి అనే నటి పై యాసిడ్ దాడికి పాల్పడ్డాడట. నారయణ పూర్ గ్రామంలోని ఓ కాలేజీ ప్రాంగణంలో షూటింగ్ జరుగుతుండగా, విరామ సమయంలో వారు అక్కడే నిద్రించారు. అదను చూసిన అజయ్ వారిపై యాసిడ్ పోసి పరారైయ్యాడు. వారిద్దరినీ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న దర్శకుడి కోసం వెతుకులాట ప్రారంభించినట్లు ఎఎస్పీ గోస్వామి మీడియాకు తెలిపారు.