దక్షిణాది సంప్రదాయదుస్తుల్లో బిగ్ బీ

March 12, 2015 | 02:56 PM | 17 Views
ప్రింట్ కామెంట్
South_stars_with_BIG_B_niharonline

​అమితాబచ్చన్ కు దక్షిణ భారత సినీ పరిశ్రమతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనతో కలిసి దక్షిణాది నటులు బాలీవుడ్ సినిమాల్లో చాలా మంది నటించారు. తెలుగు తమిళ డైరెక్టర్లు కూడా ఆయనతో కలిసి పని చేశారు. ఈ సంబంధ బాంధవ్యాలు ఓ యాడ్ షూట్ లోనూ ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ఆ నార్త్ సూపర్ స్టార్ తో సౌత్ సూపర్ స్టార్లు కలిసి కళ్యాణ్ జువెలరీ యాడ్ కోసం పని చేశారు. అందరూ దక్షిణాది సంప్రదాయ దుస్తులు ధరించి అభిమానులకు కనువిందు చేశారు.  టాలీవుడ్ నుంచి నాగార్జున, కోలీవుడ్ నుండి ప్రభు, విక్రమ్ ప్రభు, కన్నడ స్టార్ శివ్ రాజ్ కుమార్ కళ్యాణ్ జువెలరీ షూటింగ్ లో పాల్గొన్నారు. వి.ఎ.శ్రీకుమార్ దర్శకత్వంలో షూట్ చేసిన ఈ యాడ్ దేశ వ్యాప్తంగా ప్రసారమయ్యేలా రూపొందించారు. ఈ ఉగాదికి తెలుగు రాష్ట్రంలో, ఏప్రిల్ మొదటి వారంలో తమిళ నాడులో ఈ ప్రకటనను ప్రసారం చేస్తున్నారట. అయితే ఈ షూటింగ్ సందర్భాన్ని పురస్కరించుకొని తన స్నేహితులతో చాలా సరదాగా గడిచిపోయిందంటూ, ఈ ఫొటోను బిగ్ బి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అయితే ఈ యాడ్ లో నాగేశ్వర్రావు తనయుడు నాగార్జున,  శివాజీ గణేషన్ తనయుడు, మనుమడు ప్రభు, విక్రమ్ ప్రభు, రాజ్ కుమార్ తనయుడు శివ్ రాజ్ కుమార్ లు నటించడం విశేషం. అభిషేక్ బచ్చన్ ను కూడా చేర్చుకుని ఉంటే బాగుండేది కదా!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ