మూడుముళ్ళ బంధంతో ఒకటి కానున్న మరో జంట

July 18, 2015 | 05:24 PM | 7 Views
ప్రింట్ కామెంట్
urumeen_movie_press_meet_niharonline

మళ్ళీ మరో సినీ ప్రేమ జంట మూడుముళ్ళ బంధంతో ఒకటి కాబోతోంది. తమిళ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా, హీరోయిన్ రేష్మీ మీనన్ లు తమ ప్రేమ కథకు శుభం పలకనున్నారు. ఈ ఇరువురి ప్రేమకు ఇరు పక్షాల తల్లిదండ్రులు ఒకే చెప్పారట. ఆగస్టులో నిశ్చితార్థం, 2016, జనవరిలో వివాహం జరగనున్నట్టు హీరో బాబీ సింహా తన సన్నిహితులతో తెలిపాడట. అయితే ఈ వార్తలపై రేష్మీ మీనన్ కానీ, బాబీ సింహా కానీ స్వయంగా మీడియాకు తెలియజేయాలేదు. రేష్మీ తల్లిదండ్రులకు ఈ వివాహం ఇష్టం లేకపోయినా కూతురు ఇష్టాన్ని కాదనలేక ఒప్పుకున్నట్టు తెలిసింది. బాబీ సింహా పిజ్జాతో తెరంగేట్రం చేశాడు. జిగర్ తండ చిత్రంతో జాతీయ అవార్డును సొంతం చేసుకుని అందరి దృష్టిలో పడ్డాడు. బాబీ సింహా, రేష్మీ నటించిన ఉరుమీన్ చిత్రం త్రవలో విడుదలకు సిద్ధం అవుతోంది. బాబి సింహా, రేష్మీ మీనన్ ల తల్లిదండ్రులను ఒప్పించడానికి బాబి సింహా మిత్రుడు, పిజ్జా జిగర్ తండ చిత్రాల దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తీవ్ర ప్రయత్నం చేసి చివరికి వీరి పెళ్ళి కథకు శుభం పలికాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ