పదమూడేళ్ళ తరువాత కోర్టు చెప్పిన ఐదేళ్ళ జైలు శిక్ష తీర్పుతో సల్మాన్ కన్నీళ్ళ పర్యంతమయ్యాడు. ఆయనకు అభిమానుల మద్దతుతో పాటు సినీ నటులందరూ తమ పరామర్శతో ఊరడించారు. ఇప్పుడు బాంబే హైకోర్టు పూర్తి ఊరటనిచ్చింది. సెషన్స్ కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను నిలిపివేస్తూ బాంబే హైకోర్టు తీర్పు నిచ్చింది. ఆయనకు బెయిల్ కూడా మంజూరైంది.. ఈ కేసు విచారణలో అధికారుల నిర్లక్ష్యం ఉందని బాంబే హైకోర్టు న్యాయమూర్తి థిప్సే వెల్లడించారు. ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. రెండు రోజుల సంఘర్షణ అనంతరం సల్మాన్ ఖాన్ కు ఈ బెయిల్ లభించడం, ఆయన ఇప్పట్లో జైలుకెళ్లే అవకాశమే లేకపోవడంతో.... ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు సంబరాల్లో మునిగి పోయారు.