30 కాల్షీట్లు = 1 కోటి = బ్రహ్మి

July 22, 2015 | 02:20 PM | 6 Views
ప్రింట్ కామెంట్
brahmanandam_demands_1_crore_niharonline

ఈ నటుడుంటే సినిమాను హిట్ వైపుకు లాగించేయొచ్చనుకుంటున్నారు ఇప్పుడు మూవీ మేకర్లు. అందుకే బ్రహ్మానందం ప్రతి సినిమాలోనూ కనిపించేస్తుంటారు. ఇప్పుడు ఇండస్ట్రీలో కమెడియన్స్ కు కొదవేం లేదు. కానీ ఈ సీనియర్ నటుడుంటే చాలనుకుంటున్నారు. నిజంగానే ఆయన కామెడీ ఉన్న సీన్స్ అన్నీ ఓ సీడీ చేశామంటే ఎన్ని గంటలైనా నవ్వుకోవచ్చు. ఇదంతా సరే కానీ, ఆయనకున్న క్రేజ్ ను బట్టి ఇప్పుడు ఆయన కూడా రెమ్యునరేషన్ దిట్టంగానే అడుగుతున్నాడండోయ్... ఇంతకి అసలు విషయం ఏమిటంటే టాలీవుడ్ లో క్రేజ్ కమెడియన్ గా పేరుండడమే కాదండీ... కొంతమంది లెగ్ మహత్యం ఆయనను తీసుకుంటే సినిమా హిట్ అవుతుందనే సెంటి మెంట్లు కూడా ఉన్నట్టున్నాయి. బ్రహ్మానందం క్రేజ్ ను కాష్ చేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తారు దర్శక నిర్మాతలు. అయితే ఓ సినిమాలో నటించేందుకు మన బ్రాహ్మి కేవలం 30 రోజుల కాల్షీట్స్ కోసం ఏకంగా కోటి రూపాయలను డీమాండ్ చేసాడట ! ఇప్పుడు ఈ న్యూస్ సంచలనం సృష్టిస్తోంది. ఇలా ఓ కమెడియన్ కేవలం ముప్పై రోజులకు ఇంత భారీ మొత్తాన్ని ఆశించడం ఇంతకు ముందెప్పుడూ లేదట. చాలా ఆశగా వెళ్లిన ఆ సినిమా యూనిట్ దిమ్మతిరిగి పోయి వెనుదిరిగారట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ