ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది ఇది. ఛార్మి-దేవిశ్రీ ప్రసాద్ ల బంధం గురించి ఎప్పటినుంచో చెవులు కొరుక్కుంటున్నారంతా. వీరిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నట్టు కూడా అనుకున్నారు. కానీ ఇదేమిటో ఛార్మి ఓ ట్విస్ట్ ఇచ్చేసింది. ఛార్మి దేవీ బ్రదర్ సాగర్ కు రాఖీ కట్టిందట రాఖీ పండుగ రోజున. అంతేకాదు ‘సాగర్ నాకు దేవుడిచ్చిన సోదరుడు‘అని చెపుతోందట. ఇక ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ఛార్మికి ఏమవుతాడు? అని వరసలు మాట్లాడుకుంటున్నారు జనాలు. ఇలాగే కొన్నేళ్ళ క్రితం నటి శ్రీదేవి బోనీ కపూర్ కు రాఖీ కట్టిందట. కానీ కొన్నాళ్ళకు బోనీ కపూర్ ను పెళ్ళి చేసుకొని, మొదటి భార్యకు డైవోర్స్ ఇప్పించేసింది. దీన్ని బట్టి ఏమవర్థమవుతుంది. మరీ శ్రీదేవిలా దేవికి రాఖీ కట్టలేదుగా ఛార్మి, పాపం ఆయన తమ్ముడిని సోదరుడిలా భావిస్తే మాత్రం దేవి బ్రదర్ అయిపోతాడా ఏంటి?