చివరికి చిరంజీవి 150 చిత్రం ఓ తమిళ రీమేక్ చిత్రాన్ని ఫిక్స్ చేశారు. తమిళంలో విజయ్ నటించిన కత్తి సినిమా మీద ఎప్పటి నుంచో దృష్టి పెట్టినప్పటికీ, రీమేక్ కాకుండా మంచి కథ కోసం ఇన్నాళ్ళూ వెయిట్ చేశారు. ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరికి ఈ రీమేక్ కే ఫిక్స్ అయ్యారట మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాకు వివి. వినాయక్ దర్శకత్వం వహిస్తారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ రీమేక్ మూవీకి మురుగదాస్ స్క్రీన్ ప్లే ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. గతంలో ఠాగూర్ మూవీకి కూడా మురుగదాసే స్క్రీన్ ప్లే రాశారు. 150వ చిత్రానికి తనయుడు రామ్చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారన్న విషయం ముందుగానే ప్రకటించారు. వచ్చేనెల నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఎన్నాళ్ళుగానో ఇండస్ట్రీ మొత్తం... ఇటు మెగా అభిమానులు కూడా ఎదురు చూస్తున్న చిరంజీవి 150వ చిత్రానికంటే ముందు బ్రూస్ లో ఆయన కెమెరా ముందుకు వెళ్ళారు. కానీ ఇందులో గెస్ట్ పాత్ర మాత్రమే అయినందున చిరంజీవి 150 వ చిత్రం ఇప్పుడు తీయబోయే రీమేక్ మూవీగానే పరిగణించాలి.