ఇటీవల లింగ డిస్ట్రిబ్యూటర్లకు నష్ట పరిహారం అందుతుందనే వార్తతో లింగా వివాదం ముగిసిందని అందరూ భావించారు. కానీ ఈ రభస మళ్ళీ మొదటికి వచ్చింది. భారీ బడ్జెట్ తో నిరిమంచిన ‘లింగ’ చిత్రం అట్టర్ ఫ్లాప్ కావడంతో, ఈ చిత్రాన్ని భారీ మొత్తానికి తీసుకున్న డిస్టిబ్యూటర్లు బాగా నష్టపోయారు. దీంతో డిస్టిబ్యూటర్లు తమకు న్యాయం జరగాలని ‘లింగ’ చిత్ర నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ను కోరారు. రాక్ లైన్ వెంకటేష్ ఒప్పుకోకపోయేసరికి సమస్య జటిలమైంది. దీంతో చివరికి తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్‌థాను, దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్ ఈ విషయంపై మాట్లాడి ‘లింగ’ చిత్ర సమస్యను పరిష్కరించారు. అలాగే చివరకు హీరో రజనీకాంత్ కూడా ఈ విషయంపై కలుగచేసుకుని రూ.12.5కోట్లు నష్టపరిహారంగా చెల్లించారు. కానీ ఆ డబ్బు తమకు అందలేదంటూ డిస్టిబ్యూటర్లు మళ్లీ గొడవ మొదలు పెట్టారు. ఈ విషయంపై తాజాగా ‘లింగ’ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ... నష్టపరిహారం విషయంలో తమకు మోసం జరిగిందని, కలైపులి ఎస్.థాను తదితరులు తమను నమ్మించి మోసం చేసారని ఆరోపించారు. డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు నష్టపరిహారం చెల్లించకపోతే 13వ తేదిన రజనీకాంత్ ఇంటి ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అలాగే కలైపులి ఎస్.థాను నిర్మించే చిత్రాలకు తాము సహకరించమని వారు స్పష్టం చేసారు. ఈ వ్యవహారం ఎంత వరకు వెళుతుందో వేచ చూడాల్సిందే...