సంచలన మాటల చేతల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఢిల్లీ హైకోర్టు 10లక్షల జరిమానా విధించింది. రాంగోపాల్ వర్మ షోలే సినిమాకు సంబందించిన కాపీ రైట్స్ అతిక్రమించాడని షోలే సినిమా నిర్మాత కుమారుడు, మనవడు విజయ్ సిప్పీ, జీపీ సిప్పీలు కోర్టుకు వెళ్ళారు. వర్మ తన సినిమా పేరును "ఆగ్"అని పెట్టినా, తమ సినిమా షోలేను అనుమతి లేకుండా పాత్రలు, సన్నివేశాలను కాపీ చేశారని ఆరోపించారు. సంగీతం కూడా వాడుకున్నాడట రాం గోపాల్ శర్మ. కోర్టు విచారణలో రాంగోపాల్ వర్మ చేసిన తప్పిదం కాపీరైట్ హక్కుల ఉల్లంఘనలోకే వస్తుందనీ, ఇది కావాలనే చేసినట్టుగా ఉందని, ఇది నిబంధనలను అతిక్రమించినట్టు అవుతుందని అభిప్రాయపడింది. ఈ మేరకు జస్టీస్ మన్మోహన్ సింగ్.. రామ్ గోపాల్ వర్మకు రూ.10 లక్షలు జరిమానా విధించారు!
1975లో విడుదలైన షోలే సినిమా ఇటీవలే 40 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ షోలే కి సోలో ఫ్యాన్స్ ఉన్నారన్నా కూడా అది అతిశయోక్తి కాదు! అయితే ఇంతటి ఘనవిజయాన్ని సాధించిన సినిమాని 2007లో "ఆగ్"పేరుతో వర్మ రీమేక్ చేశాడు. ఇది అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అభిమానుల నుంచి వర్మ బాగా విమర్శలను ఎదుర్కొన్నాడు. ఆ తరువాత తాను చేసింది తప్పేనని ఒప్పుకున్నాడు కూడా.