ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర తమ్ముడు అజిత్ సింగ్ డియోల్ కన్నుమూశారు. ఈయన నటుడు అభయ్ డియోల్ కి తండ్రి కూడా. ఈయన గత కొద్దిరోజులుగా మూత్రపిండ వ్యాధికి సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన శక్రవారం సాయంత్రం 6.30కి తుదిశ్వాస విడిచారు. ఈయన ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నపుడు, ధర్మేంద్ర తన సోదరుడి ఆరోగ్య స్థితిని ప్రతి రోజూ ఆస్పత్రికి వెళ్ళి తెలుసుకుంటూ ఉండేవారు. ఆయన మృతి వార్త విని ధర్మేంధ్ర షాక్ కు లోనయ్యారు. అజిత్ పంజాబీ చిత్రాల్లో నటుడిగా, దర్శకుడిగా పనిచేశారు. బాలీవుడ్లో మెహర్బానీ, బర్సాత్ చిత్రాల్లో నటించాడు. అజిత్ కుమారుడు అభయ్ డియోల్ ప్రస్తుతం బాలీవుడ్లో హీరోగా నటిస్తున్నాడు.