తండ్రీ కూతుర్లేంటి? అకీరా ఏంటి అకీరా పవన్ కళ్యాణ్ కొడుకు పేరు కదా? మరి తండ్రీ కూతుర్లంటే ఆధ్యా పేరు కాకుండా అకీరా ఏంటి అనుకుంటున్నారు కదా... అసలు పవన్ కళ్యాణ్ కు ఏ మాత్రం సంబంధం లేని న్యూస్ అండీ ఇదీ... ఇక్కడ తండ్రీ కూతుర్లంటే శత్రుఙ్ఞ సిన్హా, సోనాక్షి.... వీరిద్దరు నటించే సినిమా పేరే ‘అకీర’. ప్రముఖ తమిళ దర్శకుడు, 'గజిని' ఫేం మురుగదాస్ ప్రస్తుతం ఓ హిందీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటున్నారు. దీనికి హీరోయిన్ గా సోనాక్షిని ఎంపిక చేశారు. ఓ పాత్రలో ఆమె తండ్రి శత్రుఙ్ఞ కూడా నటిస్తున్నారు. ఇంతకీ అకీరా అంటే.. 'గ్రేస్ ఫుల్ స్ర్టెంత్' అని అర్థమట. మురుగదాస్ ఈ టైటిల్ పెట్టింది పవన్ కళ్యాన్ కొడుకుని దృష్టిలో ఉంచుకుని మాత్రం కాదు. అఖీరా కురసోవా అనే ప్రపంచ ప్రఖ్యాత జపనీస్ దర్శకుడిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ సినిమాకు ఈ పేరు పెట్టి ఉండవచ్చని గెస్ చేస్తున్నారు. ఇంతకీ ఈ చిత్రం తమిళంలో విడుదలైన ‘మౌనగురు' చిత్రమే నట. దాన్ని హిందీలోకి రీమేక్ చేస్తున్నారు.