డైరెక్టర్ శంకర్ కు సుజాతలాంటి రైటర్ కావాలట

June 27, 2015 | 03:49 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Director_Shankar_searching_writer_niharonline

దర్శకుడు శంకర్‌ ఈ స్థాయికి రావడానికి కారణం రచయితగా సుజాత రంగరాజన్‌ అంటున్నారు. ఈ డైరెక్టర్ ఎదుగుదలకు తన కథే ప్రధానం అంటున్నారు. సోషల్‌ మెసేజ్‌ని, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ని మిక్స్‌ చేసి అద్భుతమైన కథలు అందించిన సుజాత రంగరాజన్‌ డైరెక్టర్‌గా శంకర్‌ రేంజ్‌ని పెంచారు. అయితే సుజాత మరణించిన తర్వాత శంకర్‌ కథలు సిద్ధం చేసుకునే విషయంలో తడబడుతున్నాడు. 'ఐ'లో రచయితగా తనకి వున్న బలహీనతలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. ఈ చిత్రం తమిళంలో ముక్కీ మూలిగినా, తెలుగులో మాత్రం పరాజయం పాలయింది. శంకర్‌ స్థాయిని ప్రశ్నించేలా చేసిన ఈ ఫలితంతో ఆయన మేలుకున్నాడు. తనకి సుజాతలాంటి ఒక మంచి రైటర్‌ అవసరం చాలా వుందని గుర్తించాడు. 

అందుకే ఇప్పుడు అలాంటి రైటర్‌ కోసం వేటాడుతున్నాడు. రజనీకాంత్‌తోనే శంకర్‌ మలి చిత్రం మొదలు కావాల్సింది. కానీ కథాపరంగా శంకర్‌ ఇంకా కాన్ఫిడెంట్‌గా లేకపోవడంతో రజనీ వేరే సినిమా చేసుకుంటున్నారు. ఒక రైటర్‌ దొరికి, కథ తనని పూర్తిగా సంతృప్తి పరిచే వరకు నెక్స్‌ట్‌ సినిమా మొదలు పెట్టకూడదని శంకర్‌ ఫిక్సయ్యాడు. అందుకే ఇప్పుడాయన ఎక్కడా కనిపించడం లేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ