ఒకప్పటిలా లేదు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ... అప్పుడైతే కొందరు హీరోలు ఆ హోటల్ నుంచి వచ్చిన కేరియర్ అయితేనే తింటారు... పడవలాంటి పెద్ద కారు పంపితేనే సినిమా షూటింగ్ కు హాజరవుతారు... ఇక చుట్టూ మందీ మార్బలం అంతా ఆ హీరోకు దాసోహం అన్నట్టు ఉండాలి... నిర్మాతలను చాలా తిప్పలు పెట్టేవారని కూడా వినేవాళ్ళం. మరి ఇప్పటి హీరోల సంగతో....చాలా మంచోళ్ళయిపోతున్నారు. సెట్ లో అందరితోనూ కలివిడిగా ఉంటున్నారు. పెద్ద చిన్న తారతమ్యం అనేది చూపించడం లేదు.
మన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సింప్లిసిటీ గురించి దర్శకుడు సుకుమార్ గొప్పగా చెప్పుతున్నారు. ‘నాన్నకు ప్రేమతో’ అనే సినిమాకు ఎన్టీఆర్ సుకుమార్ డైరెక్షన్ చేస్తున్న విషయంలో తెలిసిందే. అయితే ఈ సినిమాను ఇటీవలే 80 రోజుల లాంగ్ షెడ్యూల్ లండన్ లో ముగించుకుని ఇండియా చేరుకుంది. ప్రస్తుతం షార్ట్ గ్యాప్ తీసుకున్న ఈ చిత్ర టీం దసరా తర్వాత మరో మేజర్ షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్లనుంది. అయితే లండన్ లో ఎన్.టి.ఆర్ చూపిన సింప్లిసిటీ ఈ చిత్ర బృందానికి తెగ నచ్చేసిందట. ఈ విషయాన్నే డైరెక్టర్ సుకుమార్ చెప్పుకొచ్చాడు.
ఈ చిత్రం షూటింగ్ ఎబ్రాడ్ లో జరుగుతోంది. సినిమా కాస్ట్ తగ్గించడం కోసం ఎన్.టి.ఆర్ కి మాత్రమే 5 స్టార్ హోటల్ ని బుక్ చేసి మిగతా వారందరికీ ఓ చిన్న హోటల్ బుక్ చేసారట. కానీ ఎన్.టి.ఆర్ 3 రోజుల తర్వాత ఆ 5 స్టార్ హోటల్ ని వెకేట్ చేసి తన టీం ఉన్న హోటల్ లోనే ఉన్నాడట. అంతే కాకుండా హోటల్ మరియు సెట్స్ లో చాలా సింపుల్ గా, కలివిడిగా ఉంటూ టీం అందరి మనసును దోచుకున్నాడని సుకుమార్ తెలిపాడు. తనకు షూటింగ్ లేకపోయినా... సెట్ లోనే ఉంటూ అందరితో మాట్లాడుతూ కాలక్షేపం చేసేవాడట. ఎన్టీఆర్ ను ఇలా చూసిన ఆ టీం అంతా తెగ ముచ్చటపడిపోయేవారట. ఈ నెల 24 లేదా 25న ఈ చిత్ర టీం స్పెయిన్ వెళ్లి అక్కడ కొన్ని సీన్స్ తో పాటు రెండు పాటలని కూడా షూట్ చేసి సినిమా షూట్ ని ఫినిష్ చేస్తారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.