నేను బతికే ఉన్నా...!

May 19, 2015 | 01:47 PM | 53 Views
ప్రింట్ కామెంట్
Hollywood_Actors_Jackie_Chan_niharonline

ఏమిటో ఈ మధ్య సెలబ్రిటీలను అన్యాయంగా వార్తల్లో చంపేస్తున్నారు... ఆ తరువాత నేను బతికే ఉన్నానంటూ వాళ్ళు సోషల్ మీడియాలో అందరినీ పలకరించాల్సి వస్తోంది. అది మన ఇండియా వరకే అనుకుంటే పొరపాటు ఇది హాలీవుడ్ నటుడు జాకీచాన్ విషయంలోనూ జరిగింది. ఈ నటుడు అందరికీ సుపరిచితులే... ఎందుకంటే ఫైట్స్ ను అందరూ ఈయనను ఇన్ స్పిరేషన్ గా తీసుకుంటారు కాబట్టి. అలాంటి జాకీచాన్ చనిపోయాడని హాలీవుడ్ లోని పలు పత్రికలు ప్రచురించాయి. ఈ వార్త తెలిసి అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆందోళన పడ్డారు. జాకీచాన్ విమాన ప్రమాదంలో మరణించాడంటూ వచ్చిన వార్తలపై చివరికి జాకీచానే స్పందించకతప్పలేదు. ‘నేను చాలా ఆరోగ్యంగా, సంతోషంగా వున్నానని, నేను విమాన ప్రమాదంలో చనిపోయినట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు’’ అని  చెప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఆయన అభిమానులు ఊపిరి పీల్చు కున్నారు. జాకీ చాన్ తనపై ఇతర సోషల్ మీడియాలో వస్తున్నవార్తలను కూడా నమ్మవద్దని, తన వివరాలకోసం తన అఫీషియల్ వెబ్ పేజీని మాత్రమే ఫాలో అవ్వమని ఆయన కోరారు. .ఆయన గురించి ఇలా పుకారు ఎవరు పుట్టించారో గానీ ఆయన మాత్రం హాపీగా కేన్స్ ఫెస్టివల్ లో ఎంజాయ్ చేస్తున్నాడట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ