చాలా సినిమాలూ ఫైనాన్స్ కారణాల వల్ల సగంలో ఆగిపోతుంటాయి. అదే విధంగా గోపీచంద్-నయనతారలతో తీస్తున్న ఓ సినిమా ఫైనాన్స్ కారణాలవల్ల కొంతకాలం, కథ సరిగా కుదరడంలేదని, దర్శకుడు మారిపోవడం వల్ల ఈ ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయింది. అయితే ఇలాంటి సినిమాలు ఆ హీరోకు హిట్ వస్తే, ఆగిపోయిన చిత్రాలు మళ్లీ ప్రారంభించాలనే ఆలోచనలో ఉంటారు. హిట్ ని క్యాష్ చేసుకోవటానికి ప్లాన్ చేస్తుంటారు. ఇది ఆ హీరోకి కాస్త ఇబ్బందే. గోపిచంద్ అలాంటి పరిస్థతిని ఎదుర్కొంటున్నటుట సినీ సమాచారం. గోపీచంద్, నయనతార జంటగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కుతూ ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమయింది. గోపీచంద్, ప్రకాష్ రాజ్ మరియు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో సోమవారం హాస్పిటల్ సన్నివేశాలను చిత్రీకరించారు. ‘లౌక్యం' హిట్ తో తిరిగి ఈ ప్రాజెక్టు కు మోక్షం వచ్చింది. బి.గోపాల్ ఈ చిత్రాన్ని ఎలాగైనా హిట్ చెయ్యాలని పట్టుదలగా ఉన్నారు దర్శకులు. ఈ చిత్రంలో గోపీచంద్ పోరాట వీరుడుగా కనిపించనున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరమీదకు తీసుకువచ్చేప్రయత్నం చేస్తున్నారు. 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు', 'ఇంద్ర' లాంటి చిత్రాల్ని రూపొందించిన బి.గోపాల్ ఈసారి గోపీచంద్‌ని ఓ కొత్త కోణంలో చూపించాలని ఉత్సాహపడుతున్నారు.