ముంబయిలో ఇళ్ళ గురించి చెప్పాలంటే... పెద్ద పెద్ద స్టార్లు కూడా ఇళ్ళు కొనలేక రెంటెడ్ హౌసుల్లో కాలక్షేపం చేస్తుంటారనే వార్తలు వింటుంటాం. అక్కడ ఇల్లుందంటే వాళ్ళు చాలా స్థితిమంతుల కింద లెక్క. అయితే హన్సిక ముంబయి శివార్లలో ఏకంగా ఒక ఎకరం భూమి కొనేసిందట. అయితే ఇందులో ఇల్లు కట్టేస్తుందేమోనేని కొందరు అడగ్గా, ఇప్పటికి ఇంకా ప్లాన్ చేయలేదనీ, ఒక వేళ కడితే తను దత్తత తీసుకున్న అనాథలు అక్కడే ఉంటారని చెపుతోంది. నాలుగు నెలల కిందటే కొనుగోలు చేసినా, ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంచి ప్రాపర్టీ గురించి ఎప్పటి నుంచో సెర్చ్ చేస్తున్నానని, ప్రస్తుతం కొనుగోలు చేసింది సిటీకి గంటన్నర దూరమని చెబుతోంది. ల్యాండ్ కొనుగోలు చేసింది గానీ, ఈ ల్యాండ్ కొనడానికి చాలా మొత్తంలో మనీ కేటాయించడంతో నిధులు సమకూర్చిన తర్వాత నిర్మాణం మొదలుపెట్టాలని భావిస్తోంది. ఇంత చిన్న వయసులోనే తన సంపాదనలో అనాథల కోసం ఖర్చుపెట్టడం వారికోసం ఇల్లు నిర్మించాలనే ఆలోచనలో ఉండడం నిజంగా హన్సికది చాలా గొప్ప మనసు!