సల్మాన్ భజరంగి భాయిజాన్ బాలీవుడ్ లో టాప్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సినిమాలో సల్మాన్ నటన అద్భుతం అంటూ ఇప్పటికే క్రిటిక్స్ మంచి మార్కులు వేశారు. అయితే ఈ చిత్రంలో మరో ప్రధాన ఆకర్షణ సల్మాన్ తో నటించిన చిన్నారి. ఈ పాప పేరు హర్షాలీ మల్హోత్రా. హీరోలను హీరోయిన్ తో తోటి నటులతో పోల్చి బాగా నటించారని చెపుతుంటారు. ఈ సినిమాలో మాత్రం సల్మాన్ తో సరిసమాన మైన నటనతో మెప్పించిందట హర్షాలీ... తొలి ప్రయత్నమే ఈ బేబి షాహిదా పాత్ర లో ఎంతో గొప్పగా నటించిందని అందరూ పొగిడేశారు. ఈ చిన్నది నటనలోనే కాదు చదువులో కూడా టాపర్ అట. షూటింగ్ లో చక్కగా హోం వర్క్ చేస్తూ కనిపించేదట. ఈ అమ్మడిని పెద్దయ్యాక ఏమవుతావ్? అని అడిగితే ‘కరీనాకపూర్, కత్రినకైఫ్ అంత పెద్ద స్టార్ అయిపోతాన’ని చెపుతోందట. షూటింగ్ లో సల్మాన్ ఖాన్ చక్కగా ‘సల్లూ మామ’ అని పిలిస్తూ మొదటిరోజు నుంచే మొహమాట పడకుండా మాట్లాడేసిందట. ఈ చిన్నారికి ఫైటింగ్ లూ, తుపాకీ చప్పుళ్ళంటే భయమట. షూటింగ్ టైమ్ లో తుపాకీ కాల్పులు వినిపించినప్పుడు భయంతో ఏడ్చేదట. షూటింగ్ విరామంలో సల్మాన్, కబీర్ ఖాన్ సిద్ధిఖీ వంటి వారితో స్నోబాల్ టేబుల్ టెన్నిస్ వంటి ఆటలు ఆడుతూ చాలా సరదాగా గడిపేదట ఈ చిన్నారి. ఇప్పుడే నటనలో సల్మాన్ తో పోటీ పడుతున్న ఈ చిన్నది ఇక టాప్ స్టార్ కాకుండా ఎలా ఉంటుంది. నేటి బాల తారలే రేపటి హీరోయిన్లు కదా మన ఇండస్ట్రీలో.