ఇప్పుడు ఏ సినీ తారలకు సంబంధించిన వార్తలైనా సోషల్ నెట్వర్కుల్లో ఎప్పటికప్పుడు అప్ డేట్ అయిపోతున్నాయి. అభిమానుల, విమర్శకుల స్పందనలు, ప్రతిస్పందనలు వెంట వెంటనే తెలిసిపోతున్నాయి. ఇప్పుడు మళయాళ హీరో మోహన్‌లాల్ సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలకు చాలా హర్ట్ అయ్యారు. ఆ హీరో బాధను అర్థం చేసుకున్న మరొక హీరో మమ్ముట్టి ఆయనకు బాసటగా నిలిచారు. కేరళలలో జరిగిన జాతీయ క్రీడలకు సంబంధించి మోహన్‌లాల్ నెట్ వర్క్ సైట్లలో చర్చనీయాంశం అయ్యాడు. 35వ జాతీయ క్రీడల ప్రారంభ ఉత్సవంలో ఆయన ఆధ్వర్యంలో ఇచ్చిన ప్రదర్శనపై విమర్శలు పోటెత్తాయి. 'లాలీసమ్' బ్యాండ్ సంగీత ప్రోగ్రాం చాలా చెత్తగా సాగిందనే విమర్శలు గుప్పించారు. దీనికి స్పందించిన మోహన్ లాల్ ఈ కార్యక్రమంలో తాము ఫెయిలయ్యామని.. అందుకే తాము తీసుకొన్న డబ్బును వెనక్కు ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఆయన బాధను అర్థం చేసుకున్న మమ్ముట్టి 'ఒక కార్యక్రమం నిర్వహించాలంటే కళాకారులు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. మోహన్ లాల్ ఈ కార్యక్రమం నిర్వహణను బాధ్యతగా తీసుకోసుకున్నాడు. దీనికి మనం గర్వించాలి. ఆయన స్ఫూర్తిని అందరూ అభినందించాలి' అని విలేకరుల సమావేశంలో అన్నారట. మోహన్ లాల్ కు అండగా నిలబడాలని సహచర నటులను కోరారట మమ్ముట్టి. అయితే మోహన్ లాల్ ఆవేదనగా తిరిగి ఇస్తానన్న సొమ్మును కేరళ ప్రభుత్వం తిరస్కరించింది.