ఎప్పుడూ స్వచ్ఛమైన నవ్వుతో కనిపించే స్నేహ చెదరని అదే దరహాసంతో జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్టనిపిస్తోంది కదూ.... మొన్న శ్రీమంతం చేసుకుని, నిన్న బాబుకు జన్మనిచ్చి, ఈరోజున ఆనందంగా నామకరణ ఉత్సవం జరిపించుకుంటోంది. అన్ని వేడుకలనూ సోషల్ మీడియాలో అభిమానులతో ఆనందంగా పంచుకుంటోంది. అసలే సినిమా హీరో హీరోయిన్లు అందమైన, కనులకింపైన జంట స్నేహ-ప్రసన్నలది. వీరి పెళ్ళి వేడుక కూడా కన్నుల పండుగగానే జరిగింది. ఆ తరువాత వేడుకలన్నీ అట్టహాసంగానే జరుపుకుంటున్నారు.
ఆగస్టు 10న స్నేహ మగబిడ్డకు జన్మనిచ్చింది. స్నేహ కొడుకుకు ఏం పేరు పెడుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. తమ ఏరి కోరి చివరకు విహాన్ అనే పేరును సెలక్ట్ చేశారు ఈ దంపతులు. మొత్తానికి తమ కొడుకు పేరును బాగా ఆలోచించి ఓ కొత్త పేరే పెట్టేశారు. మా నీహార్ ఆన్ లైన్ విహాన్ కు ఆశీస్సులు అందిస్తోంది.