బాహుబలి తర్వాత బ్రహ్మోత్సవమేనా?

February 06, 2016 | 12:14 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Brahmotsavam-overseas-rights-sold-niharonline

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలకి మొదటి నుంచే ఓవర్సీస్ లో మంచి డిమాండ్ వుంది. సీతమ్మ వాకట్లో సిరిమల్లె చెట్టు, వన్, ఆగడు, శ్రీమంతుడు ఇలా అన్ని అసలు ఫలితాలతో సంబంధం లేకుండా ఓవర్సీస్ లో కలెక్షన్లతో దుమ్ముదులిపేశాయి. శ్రీమంతుడు అయితే ఏకంగా యుఎస్ లో 18 కోట్లను వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. దీంతో మహేష్ తర్వాతి ప్రాజెక్టుపై బడా సంస్థల కళ్లు పడ్డాయి.

'బ్రహ్మోత్సవం' సినిమాపై అక్కడ భారీగా అంచనాలు నెలకొంటున్నాయి. ఈ కారణంగానే ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కి 13 కోట్ల ఆఫర్ వచ్చినట్టు చెబుతున్నారు. ఓవర్సీస్ హక్కులు తమకి ఇవ్వమంటూ ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీపీ సంస్థను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం 'బ్రహ్మోత్సవం' చిత్రం షూటింగ్ దశలో వుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడిగా వ్యవహరిస్తున్న చిత్రంలో సమంత, కాజల్, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు.

ఒకవేళ ఈ డీల్ ఫైనల్ అయితే ఈ స్థాయి ధరకి అమ్ముడైన మొదటి తెలుగు సినిమాగా రికార్డును సొంతం చేసుకోవటం ఖాయం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ