హనీ సింగ్ పాటలకు పందులు పరార్

December 04, 2015 | 11:58 AM | 3 Views
ప్రింట్ కామెంట్
pests-running-from-fields-honey-singh-song-niharonline

సంగీతానికి రాళ్లు కరుగుతాయన్నది విన్నాం కానీ, అది నిజమో కాదో మనం చూసి ఉండకపోవచ్చు. మూగజీవాలు స్పందిస్తాయన్నది అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. కానీ, ఇక్కడ సంగీతానికి మాత్రం మూగ జీవులు ఓ రేంజ్ లో భయంతో బెంబేలెత్తి పారిపోతున్నాయి. పంజాబీ గాయకుడు హనీ సింగ్ (యో యో ఫేం) పాటలు ఎంత పాపులరో మనకు తెలుసు. డిస్కో పార్టీలలో, పెళ్లిళ్లలో, ప్రతీ పంక్షన్లలో అతని పాటలు ఇఫ్పుడు మారుమోగుతున్నాయి. చిన్న పిల్లల దగ్గరి నుంచి పండు ముసలి వరకు అతగాడి పాటలకు స్పందిస్తారు. కానీ, అతగాడి పాటలు ఇప్పడు రైతులకు బాగా సాయపడుతున్నాయట.

                ఉత్తరాఖండ్ లో రైతులు పోలాల్లో హనీసింగ్ పాటలను పెడుతున్నారట. అక్కడ పోలాలపై అడవిపందులు ఎక్కువగా దాడి చేయటం ఎప్పటి నుంచో ఉంది. దానికి 24 గంటలు మనుషులు కాపలా ఉంచటం కష్టం అవుతుండటంతో పెద్ద పెద్ద శబ్ధాలున్న భజన పాటలను మొదట్లో పెట్టేవారు. అయితే హనీ సింగ్ పాటలు కూడా ఆ రీతిలోనే ఉండటంతో ప్రయోగాత్మకంగా వినిపించగా అవి పారిపోవటంతో దానినే కంటిన్యూ చేస్తూ వస్తున్నారక్కడి రైతులు. ఒక్క అడవి పందులే కాదు తోడేలు, పిట్టలు మొదలైన మూగజీవాలు కూడా స్పందించి అక్కడి నుంచి పారిపోతున్నాయంట.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ