భారీ అంచనాలతో, భారీ ఖర్చుతో, ఎంతో రిస్కు తీసి చేసిన సినిమాలు బాక్సాఫీసు వద్ద డింకీ కొడితే? ఇప్పుడు లింగా డిస్ట్రిబ్యూటర్ చేస్తున్న ఆందోళన చూస్తుంటే ‘ఐ’ సినిమాపై కూడా టెన్షన్ పెరిగిపోతుందంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. లింగ సినిమాకు నాలుగో వంతు కూడా కలెక్షన్ లు రాలేదట. లింగ సినిమా విడుదలకు ముందు నుంచే నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ చాలా ఆందోళనకు గురవుతున్నాడు. ఇక ఇప్పుడు ఐ సినిమా కూడా అదే స్థాయిలో వివాదాలతో బ్రేక్ లు పడుతూ వస్తోంది. ఐ సినిమాను ఆపాలని న్యాయస్థానం బ్రేక్ వేయగా, దాన్ని తిరిగి సెటిల్మెంట్ చేసుకుని విడుదల చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా శంకర్ బ్రాండ్ తో బిజినెస్ బాగానే చేసుకుంది. విక్రమ్ నటించడం వల్ల కూడా దీనికి అంచనాలు బాగానే పెరిగిపోయాయి. శంకర్ విజయ్ తో తీసిన స్నేహితుడు పెద్దగా ఆడలేదు. విక్రమ్ కూడా కొన్ని ఫ్లాప్ లు ఇచ్చాయి. ఇవన్నీ ఆలోచిస్తే డిస్ట్రిబ్యూటర్లకు ఆందోళన కలుగుతోంది. కొందరయితే మంచి విజయం సాధిస్తుందన్న కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఏ విషయం ఐ రిలీజ్ అయితే గానీ తెలియదు.