అందాల ఆరబోతలతో హాలీవుడ్ భామలు ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద టాపిక్ అయిపోయారు. ఒకరినిపించి ఒకరు నగ్న ఫోటో షూట్ లతో హాటెక్కించేస్తున్నారు. ఇప్పటికే కిమ్ కర్ధాషియాన్, కెండాల్ జెన్నర్, మిలీ సైరస్, మరికొందరు హాలీవుడ్ భామలు పలు మేగజైన్ల కోసం సెన్సేషన్ న్యూడ్ ఫోటో లతో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించాలని తాపత్రపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తానేమీ తీసిపోయానా, తన అందమేం తీసి పోయిందా? ఇంటర్నేషనల్ స్థాయిలో తన ర్యాంక్ ఎక్కడ పడిపోతుందో అని బెంబేలుపడిన హాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఆస్కార్ అవార్డ్ గ్రహీత జెన్నిఫర్ లారెన్స్ కూడా నగ్న అందాలతో విందు చేసేసింది జనాలను. ఇంతకు ముందు న్యూడ్ ఫొటోలకు పోజులిచ్చిన భామల మీది చూపులను తన వైపుకు తిప్పుకోవడానికి ఇంతకు మించిన దారి లేదని భావించింది కాబోలు ఆమె కూడా ఓ మేగజైన్ కోసం నగ్న ప్రదర్శన చేసింది. స్పెషల్ ఎఫెక్టు కోసం కొండ చిలువతో ఈ ఫోటో షూట్ ప్లాన్ చేసారు. వానిటీ ఫేయిర్ మేగజైన్ కోసం ఆమె ఈ ఫోటో షూట్ లో పాల్గొన్నారు. ఈమె ఇప్పటి వరకూ 15పైగా హాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ‘సిల్వర్ లైనింగ్స్ ప్లే బుక్’ అనే చిత్రానకి ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు అందుకుంది.