జిగర్తండ నిర్మా తపై దర్శకుడి కేసు...

May 20, 2015 | 04:42 PM | 54 Views
ప్రింట్ కామెంట్
kadireshan_karthik_subbaraju_jigalthanda_niharonline

తమిళంలో పిజ్జాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తర్వాత జిగర్ తండా చిత్రాన్ని తెరకెక్కించి మరో సూపర్ హిట్ కొట్టాడు. అయితే జిగర్ తండా విడుదల సమయంలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుకి, నిర్మాత కదిరేశన్ కి మధ్య మనస్పర్ధలు ఎర్పడ్డాయి. అయితే తాజాగా మరోసారి ఆ గొడవ బయటపడింది. వివరాల్లోకెళ్తే..జిగర్ తండా చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి షాజిద్ నజిద్ వాలా కి నిర్మాత కదిరేశన్ ఎక్కువరేటుకి అమ్మేశాడు. అయితే ఈ చిత్రంలో తనకు నలభై శాతం వాటా ఉందని తనకి తెలియకుండా నిర్మాత హిందీ రీమేక్ రైట్స్ అమ్మేశాడని కార్తీక్  సుబ్బరాజు నిర్మాత కదిరేశన్ పై దర్శకుల సంఘంలో పిర్యాదు చేశాడు. మరి దీనిపై నిర్మాత ఎలా స్పందిస్తాడో చూడాలి. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ