ఇప్పటి కృష్ణుడు జూనియ్ ఎన్టీఆర్ అంటున్నజక్కన్న

August 10, 2015 | 04:24 PM | 3 Views
ప్రింట్ కామెంట్
jr_NTR_is_only_krishna_in_telugu_industry_niharonline

బాహుబలి సినిమాతో ఒకప్పటి యుద్ధాలు, రాజులు, రాజమందిరాల్ని చూపించాడు మన తెలుగు డైరెక్టర్ రాజమౌళి. అప్పట్లో రాజులు కత్తి యుద్ధాలు చేస్తుంటే విరగబడి చూసే వారు ప్రేక్షకులు... కత్తుల యుద్ధాల్ని మళ్ళీ ఇన్నాళ్ళకు తెరమీద చూపించి ఆ పాత మధురాన్ని గుర్తు చేశారు రాజమౌళి.... మూస చిత్రాలను చూసిన ప్రేక్షకులు ఈ సినిమా చూసి చాలా రిలీఫ్ కు గురయ్యారు. మరి అప్పట్లో వచ్చిన రామాయణ మహా భారత సినిమాలూ... ఇప్పుడు తీసే సాహసం ఎవరూ చేయడం లేదు... ఆ ఆలోచన కూడా వచ్చింది దర్శకుడు రాజమౌళికి. సీనియర్ ఎన్టీఆర్ ఎన్ని సినిమాల్లో కృష్ణుడి పాత్ర చేశాడు? తెలుగు ప్రేక్షకులు రాముదు అంటే ఎన్టీఆర్, కృష్ణుడు కూడా ఎన్టీఆరే... ఆయన ఫొటోలు పెట్టుకుని దేవుడిగా కొలిచిన వాళ్ళూ ఉన్నారు. ఇప్పుడు అలాంటి సినిమాలు చేస్తే కృష్ణుడెవరు? అనే ఆలోచన ఎవరికైనా కలుగుతుంది. దానికి 
ప్రస్తుతం బాహుబలి పార్ట్ 2 తీయబోతున్న రాజమౌళి ఆ తరువాత సినిమా ఏమిటో నని అనుకుంటుండగా మహేష్ తో సినిమా చేస్తాననేసరికి మహేష్ అభిమానులు ఆనందపడిపోయారు. ఆ తరువాత విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి తరువాత సినిమా అర్జున్, అజిత్ ల సినిమా అన్నాడు. కానీ మళ్లీ అందరిని అంచనాలను తారుమారు చేసే విధంగా రాజమౌళి ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.... కెరీర్లో ఎప్పటికైనా మహాభారతం సినిమా చేయాలనీ ఎదురుచూస్తున్నట్లుగా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు అక్కడివారు... ‘మహాభారతం సినిమా తీస్తే అందులో ఎవరిని శ్రీకృష్ణుడి పాత్రకోసం ఎంచుకుంటారు? అని అడిగారు. దీనికి సమాధానంగా రాజమౌళి వెంటనే స్పందిస్తూ... ఇప్పుడున్న యంగ్ హీరోలలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్రకు పర్ఫెక్ట్ గా సరిపోతాడని తెలిపాడు.  ఇందులో అనుమానం ఏం లేదు గానీ...  బాహుబలి తరువాత రాజమౌళి తీయబోయే సినిమాపై ఎన్టీఆర్, మహేష్ బాబుల అభిమానులు మాత్రం టెన్షన్ పడుతున్నారు. రాజమౌళి తరువాతి సినిమా తమ హీరోదే కావాలని ఆశపడుతున్నారు.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ