గోవాలో తెగ ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్

November 22, 2014 | 12:11 PM | 62 Views
ప్రింట్ కామెంట్

ప్రకృతి సౌందర్యానికి నిలయం గోవా. ఎటు చూసినా చెట్లు, పచ్చదనం, సముత్ర తీరంతో అందాల స్వర్గధామాన్ని తలపిస్తుంది. నిరంతరం పనులతో బిజీగా ఉండే సెలబ్రీటీలు కాస్తంత విరామం దొరికితే చాలు సేదతీరేందుకు గోవా చెక్కెస్తుంటారు. ఇప్పుడా క్యూలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేరిపోయాడు. ప్రస్తుతం మనోడు గోవాలో టెంపర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడన్న సంగతి తెలిసిందే. అయితే నిరంతరం సాగుతున్న షూటింగ్ లో కూడా ఎన్టీఆర్ మాంచి హుషారుగా ఉన్నారని చెబుతున్నారు. మనకు తెలిసిన వివరాల ప్రకారం... గోవా షెడ్యూల్‌ని జూనియర్‌ తెగ ఎంజాయ్‌ చేస్తున్నాడని.. అందమైన ప్రకృతి సౌందర్యాన్ని ఎంజాయ్‌ చేయటంతో పాటు.. షూటింగ్‌ గ్యాప్‌ దొరికితే చాలు ఎన్‌ఫీల్డ్‌ మీద సరదాగా బీచ్ లో చక్కర్లు కొట్టేస్తున్నాడని చెబుతున్నారు. నిరంతరం షూటింగ్ లో బిజీ ఉండే ఎన్టీఆర్‌కు ఆ మాత్రం రిలాక్సేషన్‌ అవసరమే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ