కరెక్ట్ కథ కుదరాలే కానీ తెలుగు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ లు కొట్టే సత్తా ఉన్న హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకడు. పచ్చిగా చెప్పాలంటే ఇప్పుడున్న టాప్ హీరోల్లో డైలాగ్ డెలివరీ లో ఎన్టీఆర్ ను కొట్టేవారే లేరు. గంభీరమైన వాయిస్, తాత స్వర్గీయ నందమూరి తారక రామారావు దగ్గరి నుంచి వచ్చిన తేజస్సు జూనియర్ సొంతం. కానీ, కెరీర్ ప్రారంభం నుంచి మెచ్యూర్డ్ క్యారెక్టర్లు చెయ్యటం మూలానో, మాస్ ఫాలోయింగ్ అధికంగా ఉండటం మూలంగానో ఎన్టీఆర్ కి సరైన హిట్లు లేకుండా పోయాయి. అసలు ఎన్టీఆర్ కి కథలు ఎంచుకోవటం రాదు అన్న విమర్శ కూడా మరోవైపు ఉంది. ఇక కెరీర్ లో ఇప్పటిదాకా చేసిన పాతిక సినిమాల్లో హిట్లను వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు. అందులో రాజమౌళి నుంచి స్టూడెంట్ నం 1, సింహాద్రి, యమదొంగ... వినాయక్ నుంచి ఆది, అదుర్స్, శీనువైట్ల నుంచి బాద్షా, వంశీపైడిపల్లి నుంచి బృందావనం, లేటెస్ట్ గా పూరి నుంచి టెంపర్ హిట్ల జాబితాలో ఉన్నాయి. అదే టైంలో బ్లాక్ బస్టర్లు అయిన చాలా చిత్రాల కథలు మందు ఎన్టీఆర్ ముందుకే వచ్చాయట. అందులో కొన్ని చెప్పుకొదగిన చిత్రాలు... దిల్ , అతనొక్కడే, కిక్, ఆర్య, భద్ర, కృష్ణ, తాజాగా శ్రీమంతుడు ఇవన్నీ కథలు ముందు ఎన్టీఆర్ గుమ్మానే తొక్కాయట. కానీ, డేట్స్ కుదరక, ఇతర కారణాలతో ఆయా చిత్రాలు వేరే వారికి తరలిపోయాయి. అంతేకాదు అవన్నీ ఆయా హీరోల ఎదుగులకు ఎలా ఉపకరించాయో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది పరిగణనలోకి తీసుకుంటే వారంతా ఎన్టీఆర్ కి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి మరి...