ఓ ఫోన్ కాల్ రాగానే ఎవరైనా సరే... ఏడుస్తూ వెళ్ళారంటే ఎంత అందోళనగా ఉంటుంది? ఆ టైమ్ లో ఫోన్ చేసి ఏం జరిగిందనే దైర్యం కూడా చేయలేకపోతారు ఎవరైనా. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చూసి, పలకరిస్తే... ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. అలాంటి పరిస్థితి ఈ మధ్య బాలీవుడ్ నటి కాజోల్ విపయంలో జరిగింది. కాజోల్ వీడియో ఒకటి నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఆమె ఫోన్ మాట్లాడ్డం ఆందోళన పడటం., వెంటనే బయటికి వచ్చి కార్లో వెళ్ళి పోవడం అంతా స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవలే కాజోల్ ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఆమె అనుకోకుండా అక్కడి నుంచి వెళ్ళి పోవడంతో... అక్కడి వారంతా అవాక్కయి చూస్తుండి పోయారు. ఏం జరిగిందో తెలియక అయోమయానికి గురయ్యారు. తనకు డ్రైవర్ వున్నప్పటికి, తానే డ్రైవ్ చేసుకుంటూ స్పీడ్ గా అక్కడి నుంచి వెళ్లిపోయిందట. ఇంతకూ అసలు విషయం గురించి.... ఓ మూడు రోజుల తర్వాత గానీ బయటకు రాలేదు. కాజోల్-అజయ్ దేవగన్ దంపతుల కుమారుడు యుగ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడట. ఈ విషయంపై కాజోల్ కు ఫోన్ కాల్ రావడంతో తట్టుకోలేక వెంటనే ఆ కార్యక్రమం నుంచి వెళ్లిపోయింది.
అయితే ఈ విషయంపై అజయ్ దేవగన్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ... యుగ్ ఇపుడు బాగానే వున్నాడు. మళ్లీ స్కూల్ కు వెళ్తున్నాడు. తన కొడుకు ఆరోగ్యం గురించి, కాజోల్ ఆందోళన గురించి స్పందించిన వారందరికీ కృతజ్ఞతలు అంటూ తెలిపాడు.