యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ఇమేజ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వైవిధ్యమైన నటనతో ఆరుపదుల వయస్సు దగ్గరపడుతున్నప్పటికీ ఎనర్జిటిక్ యాక్షన్ తో అశేష అభిమానవాహినిని ఏర్పరుచుకున్న ఘనత ఆయనది. ఓవైపు కూతుళ్లు ఇద్దరూ వెండితెరపై సందడి చేస్తూ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నప్పటికీ ఆయన మాత్రం తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు అందరి మదిలో ఉన్న ఏకైక ప్రశ్న. ఆయన కూతుళ్లతో నటిస్తారా? అని. ముఖ్యంగా పెద్ద కూతురు శృతీహాసన్ అంటే ఆయనకు ప్రత్యేక ప్రేమ. దీంతో కనీసం ఆయనతో అయిన నటించాలని అభిమానులు కొరుకుంటున్నారు. ఆ మధ్య పీకూ చిత్రాన్ని రీమేక్ సంబంధించి వార్తలు వచ్చినప్పటికీ తన కూతురితో సినిమాలు చేసే ఆసక్తి లేదని కమల్ ఓపెన్ గా చెప్పటం తెలిసిందే. దీంతో వీరి కాంబినేషన్లో చిత్రాలు కష్టమే అని అంతా ఫిక్సయ్యారు. అయితే వీరిద్దరు ఇప్పుడు తెరపై కలిసి నటిస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
కమల్ ఈ మధ్యే ఓ యాడ్ లో కనిపించారు. ఇంకోవైపు శృతి కూడా యాడ్ లలో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో కొన్ని సంస్థలు వీరిద్దరి కాంబినేషన్లో యాడ్స్ చేయడానికి ఆసక్తిని చూపుతున్నారట. అయితే అందుకు కమల్ నో చెప్పినట్లు సమాచారం. అయితే ఆ సంస్థలు మాత్రం ఆయన్ను వదలట్లేదట. ఆయన్ని ఒప్పించే భారాన్ని కూడా శృతికి అప్పగించినట్లు సమాచారం. మరి ముద్దుల కూతురు అడిగితే కమల్ ఒప్పుకోరా చెప్పండి. మంచి నాణ్యత కలిగిన ఉత్పత్తులకి సంబంధించిన యాడ్స్ మాత్రమే చేయడానికి కమల్ ఓకే చెప్పాడని సమాచారం. ఇంకేం త్వరలోనే తండ్రీ కూతుళ్లు యాడ్స్ లో సందడి చేస్తూ హడావుడి చేస్తారన్నమాట.