మహేష్ బాబు 1 నేనొక్కడినే చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైన క్రిటీసనన్, తెలుగులో నాగ చైతన్యతో దోచెయ్ సినిమాలో కూడా నటించింది. రెండూ సక్సెస్ కాకపోయినా తెలుగు చిత్రాలను వదిలేసి, బాలీవుడ్ ఆఫర్ల కోసం ముంబయి చెక్కేసింది అమ్మడు. అలనాటి బాలీవుడ్ తార మధుబాలను క్రిటీ స్ఫూర్తిగా తీసుకుని సినీరంగంలో అడుగుపెట్టాననీ, ఆమె జీవితమే తనకు ప్రేరణగా అని చెపుతోంది. అవకాశం లభిస్తే ఆమె జీవిత కథలో నటించాలని ఆశగా వుంది అని అంటోంది ఈ ఢిల్లీ భామ. కథానాయికగా కొత్తదనానికే తన తొలి ప్రాధాన్యత అని చెబుతున్న ఈ సొగసరి జీవితకథా చిత్రాల్లో నటించాలన్నది తన లక్ష్యమంటోంది. ఈ చిత్రాలు నేటి తరానికి స్ఫూర్తిగా వుంటాయంటోంది. నటీనటుల ప్రతిభకు సవాల్‌గా నిలుస్తాయని అంటోంది. అలాంటి చిత్రాల్లో నటించాలని చాలా రోజులుగా ఎదురు చూస్తోందట. ముఖ్యంగా బాలీవుడ్ నటి మధుబాల అంటే తనకు చాలా ఇష్టమనీ, ఆమె పోషించిన ప్రతి పాత్ర ఓ ఆణిముత్యమే. నటన పట్ల ఆమెలో వ్యామోహం పెరగడానికి మధుబాల సినిమాలే కారణం అంటోంది. మధుబాల జీవిత కథలో నటించాలనేది తన చిరకాల వాంఛ అట. ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందనే నమ్మకముంది అని ఆశగా చెపుతోంది. ప్రస్తుతం దిల్‌వాలే, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది కృతిసనన్.