తెలుగు సినిమాల్లో హీరోయిన్ల కొరత కనిపిస్తున్నట్టుంది. చూపించే హీరోయిన్లేమో... బాలీవుడ్ హీరోయిన్లతో పోల్చుకుని మరీ రెమ్యునరేషన్ అడిగేస్తున్నారు. వాళ్ళను కాదంటే... కాస్త కళ్ళకు ఇంపైన హీరోయిన్లు కరువవుతున్నారు. ఇప్పుడు టాప్ హీరోయిన్లను పక్కన పెడితే... ఆ తరువాతి స్థాయి హీరోయిన్లు తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే చాలా సినిమాలకు కమిట్ అయ్యింది. దీంతో లావణ్య త్రిపాఠి ఆ స్థానాన్ని బర్తీ చేయదలచుకుందేమో... ఎప్పుడూ లేనిది నాభి చూపించేసింది. టైట్ ఫిట్టింగ్స్ లో గ్లామర్ బానే ఒలకబోసింది.
మొదటి సినిమా అందాల రాక్షసితో కుర్రాళ్ళ మనసుల్ని చెదరగొట్టేసింది లావణ్య త్రిపాఠి. తొలి సినిమా నిండైన దుస్తులతో సాంప్రదాయబద్ధంగా కనిపించింది. ఆ తరువాతి సినిమాల్లో కట్టు బొట్టు తీరులో పెద్ద మార్పు కనిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం అందులోంచి బయటికి వచ్చినట్టే కనిపిస్తోంది. ఇలాగైతే పైకి ఎదగలేమనుకుందేమో స్కిన్ షో అనివార్యమనుకున్నట్టుంది. నాని భలే భలే మగాడివోయ్ చిత్రంలో కొంచెం గ్లామర్ పెంచినట్టుంది. ఈ మార్పు నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి ఎంపికైన తర్వాతిదా లేక భలేభలేతో మొదలు పెట్టిందా? సోగ్గాడే సినిమా చూస్తేగానీ తెలియదు. టాలీవుడ్ లో రెమ్యునరేషన్ కారణంగా కొందరిని ఇండస్ట్రీ దూరం పెడితే, ఇప్పుడు గ్లామర్ హీరోయిన్లకు లోటు కనిపిస్తోంది. ఇప్పుడు తెలుగులో నాగార్జున, నానిలతో పాటు అల్లు శిరీష్ పక్కన కూడా ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు. నెమ్మదిగా టాప్ ప్లేస్ కు చేరుకునే ప్రయత్నాలేమైనా మొదలు పెట్టిందేమో మరి...