‘అధినాయకుడు’, ‘కాంచన’, ‘చంద్రకళ’ చిత్రాల్లో నటించిన బెంగళూర్ భామ లక్ష్మీరాయ్ తాజాగా రాయ్ లక్ష్మీగా పేరు మార్చుకుంది. ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఓ బాలీవుడ్ అవకాశాన్ని అందిపుచ్చుకుందట. ఎ.ఆర్.మురగదాస్ దర్శకత్వంలో సోనాక్షి సిన్హా ప్రధానపాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘అకీరా’ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర కోసం రాయ్ లక్ష్మి ను ఎంపిక చేసుకున్నారట. ఈ విషయాన్ని రాయ్ లక్ష్మి తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ కావడం ఆనందంగా ఉందని మంచి గుర్తింపు వస్తుందని రాయ్ లక్ష్మి నమ్మకంగా ఉంది.