ఈ హాస్యనటుడిని కించపరిచారు

January 31, 2015 | 04:28 PM | 51 Views
ప్రింట్ కామెంట్

20 ఏళ్ళ పాటు సినిమాల్లో నటిస్తూ అందరినీ నవ్వుల్లో ముంచెత్తిన ఎమ్మెస్ నారాయణను సంస్మరించుకోవడం మరిచాయరు సినీజనాలు. తన సినీ కెరీర్ లో దాదాపు 700కు పైగా సినిమాల్లో నటించి నవ్వుల జల్లులు కురిపించారాయన. అలా అందిరినీ నవ్వించిన ఈ నవ్వులరేడుకి నేడు టాలీవుడ్’లో పరాభావం ఎదురయ్యింది. టాలీవుడ్ నటీనటులు ఎవరైనా మరణిస్తే.. వారి గౌరవార్థం సంస్మరణ సభను ఏర్పాటు చేయడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. అయితే.. ఎమ్మెస్ మృతిచెందిన వారం రోజులు అయినప్పటికీ.. ఆయన సంస్మరణ సభ ఏర్పాటు విషయంపై ఏపీ ఫిల్మ్ ఛాంబర్ గాని, మూవీ అసోసియేషన్ కాని, తెలుగు చిత్ర నిర్మాతల మండలి గాని, దర్శకుల మండలిగానీ పట్టించుకోవడం లేదు. ఆ మాటకొస్తే తమకు ఏమీ తెలియదన్నట్లుగా అందరూ వ్యవహరిస్తున్నారని సమాచారం! దీంతో తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇంకా ఎమ్మెస్ సంస్మరణ సభ ఎందుకు ఏర్పాటు చేయడం లేదంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ